Friday, November 22, 2024
Homeక్రైమ్డీజిల్ లోకో షెడ్డులో అగ్ని ప్రమాదం

డీజిల్ లోకో షెడ్డులో అగ్ని ప్రమాదం

డీజిల్ లోకో షెడ్డులో అగ్ని ప్రమాదం
వెల్డింగ్ చేస్తుండగా వచ్చిన మంటలు
మంటలు ఆర్చివేసిన కార్మికులు
స్పాట్ వాయిస్ కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని డీజిల్ లోకో షెడ్డులో గురువారం రాత్రి  అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో డీజిల్ రైలింజన్ పాక్షికంగ దెబ్బతింది. షెడ్డు కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. షెడ్డులో  మరమ్మత్తు కు గురైన డబ్ల్యుజీ లోకో రైలింజన్లు 5వ సెక్షన్ లో కార్మికులు ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ చేస్తుండగా వచ్చిన (స్పార్క్) నిప్పు రవ్వలు రావడంతో ఆ ప్రాంతమంత మంటలు చెలరేగాయన్నారు. క్షణాలలో మంటలు విజృంభిస్తుండడంతో  కార్మికులు, అధికారులు అగ్నిమాపక పరికారాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కార్మికులు అప్రమత్తంగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. డీజిల్ లోకోషెడ్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇంత వరకు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరుగలేదు. ఈ సంఘటనపై సంబంధిత షెడ్డు సీనియర్ డీఎంఈని వివరణ కోరగా.. షెడ్డులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు వచ్చాయని, కార్మికులు వెంటనే ఆర్పివేశారని, ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments