ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు రావడం తో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే బయటపడ్డాడు. మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు గోదాంలో మొత్తం 11 మంది కార్మికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు చెబుతున్నారు.
Recent Comments