Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలుసీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: ఎస్సై ఉదయ్ కిరణ్

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: ఎస్సై ఉదయ్ కిరణ్

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
– ఎస్సై ఉదయ్ కిరణ్
– సీసీ కెమెరాల పై అవగాహన

స్పాట్ వాయిస్, గణపురం: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, వ్యాపారస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోనీ పంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాల ఉపయోగాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కిరణ్ మాట్లాడారు. రోజు రోజుకూ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామానికి చాలా లాభాలు ఉన్నాయన్నారు. నేరాలను అదుపు చేయడంతో పాటు రాత్రిపూట దొంగతనాలను నివారించవచ్చన్నారు. అలాగే వాహనాల రాకపోకలను గుర్తించవచ్చన్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే వీడియో ఫుటేజీలతో ముఖ్యమైన కేసులను ఛేదించవచ్చని చెప్పారు. గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కాగా అందులో కొన్ని పని చేయడం లేదని తెలిపారు. వాటి స్థానంలో నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి గ్రామస్తుల సహకారం అవసరమని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నారగాని దేవేందర్ గౌడ్ రూ. 10 వేలు, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ రూ. 5వేలు ఎస్సై ఉదయ్ కిరణ్ కు అందజేశారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతర్ల అశోక్, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments