Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్వామ్మో గ్యాస్.. మళ్లీ పెట్రో మంటలు

వామ్మో గ్యాస్.. మళ్లీ పెట్రో మంటలు

సిలిండర్‌పై రూ.50 పెంపు..
స్పాట్ వాయిస్, హన్మకొండ: గ్యాస్‌ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్‌ ధర రూ.1002కు చేరింది. అటు దేశంలో ఇంధన ధరలు సైతం పెరిగాయి.
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందించాయి. మంగళవారం ఉదయం నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments