ఎర్రబంగారం @45 వేలు..
తెల్లబంగారం @10,720
స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: ఎర్ర బంగారం ధర మెరిసిపోతోంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సింగిల్ పట్టి మిర్చికి క్వింటాల్ ధర సోమవారం రూ. 45,000 పలికింది. వారం రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశీ రకం మిర్చికి ధర రూ.44,000 పెట్టి కొనుగోలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన లింగేశ్వరరావు 24 బస్తాల దేశీ రకం మిర్చి తీసుకొచ్చాడు. లోకేశ్వర కంపెనీ ఖరీదుదారులు రూ. 45,000 ధర నిర్ణయించారు. ఈ ఏడాదే దేశి రకం మిర్చి రికార్డు ధర నమోదు చేసుకుంటోంది.
పత్తి క్వింటాల్ ధర రూ. 10,720
ఏనుమాములలో రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ రూ. 10,720 పెట్టి కొనుగోలు చేశారు. భూపాలపల్లి జిల్లా పెరికపల్లి గ్రామ రైతు రాజు 40 బస్తాలు తీసుకురాగా.. పత్తికి ఈ ధర దక్కింది.


Recent Comments