Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఫాం హౌస్‌లో భేటి అందుకేనా..?

ఫాం హౌస్‌లో భేటి అందుకేనా..?

ముందస్తు ముహూర్తం ఫిక్సేనా..!
పరుగున వెళ్లిన మంత్రులు
ఇటీవలే కేసీఆర్ ను కలిసిన పీకే
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో అత్యవసర భేటీ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రగతి భవన్ నుంచి మంత్రులకు ఫోన్ రాగానే.. హుటాహుటినా వారంతా క్యూ కట్టారు. వీరితో పాటు ఉన్నతాదికారులు సైతం భేటీకి హాజరు కావడం విశేషం.మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు రావాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే సీఎస్ సోమేష్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇటీవల ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఫాంహౌస్‌లో అత్యవసర భేటీ జరుగుతోందనే చర్చ తీవ్రమైంది. ఇప్పటికే తెలంగాణ అమలవుతున్న సంక్షేమ పథకాలపై పీకే టీం సర్వే చేసింది. మరోవైపు బీజేపీ ఎన్నికల్లో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కొద్దిరోజులుగా వార్తలు గప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ముహూర్తం కోసమే సమావేశం జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments