Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్అలా తాకినా లైంగికదాడే..

అలా తాకినా లైంగికదాడే..

మేఘాలయ హైకోర్టు కీలక తీర్పు
స్పాట్ వాయిస్, డెస్క్: ఓ మైనర్​పై లైంగికదాడి కేసులో మేఘాలయ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆడవాళ్ల జననేంద్రియాలను లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా.. లైంగికదాడిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఇది పెనట్రేటివ్ సెక్స్ కిందికి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సంజీవ్​ బెనర్జీ నేతృత్వంలోని డివిజనల్​ బెంచ్ తీర్చునిచ్చింది.. 2006లో పదేళ్ల బాలిక తనపై లైంగికదాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 2018లో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు. బాలికపై లైంగిక చర్యకు పాల్పడలేదని, లోదుస్తులపైనుంచి పురుషాంగంతో తాకానని చెప్పాడు. అయితే బాధితురాలు సైతం తన వాంగ్మూలాన్ని మార్చి చెప్పడం గమనార్హం. తొలుత లోదుస్తులు తీసి లైంగికదాడి చేశాడని చెప్పిన బాలిక.. కొద్దిసేపటి తర్వాత వేరేలా చెప్పింది. అయినా.. వైద్య పరీక్షలు, నిందితుడు, బాధితురాలి వాంగ్మూలం పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments