Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్పెళ్లి రోజునే కల్యాణ లక్ష్మి

పెళ్లి రోజునే కల్యాణ లక్ష్మి

స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ నిధులకు కొరత లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పథకం ప్రారంభం నుంచి 10లక్షల మందికి పైగా ఆడబిడ్డలకు సాయం అందించామని వెల్లడించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీలో ఆలస్యం, పెళ్లి రోజే చెక్కులు ఇస్తే బాగుండు అనే సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కల్యాణ లక్ష్మి పెళ్లి రోజే ఇవ్వాలనేదే కేసీఆర్ ఆలోచన అని గంగుల స్పష్టం చేశారు. పెళ్లి కార్డును 15 రోజుల ముందే ప్రింట్ చేసుకుని.. అప్లై చేసుకోవాలని సూచించారు. అలా చేస్తే 15 రోజుల్లోపే.. పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి వస్తుందని మంత్రి వెల్లడించారు. కల్యాణ లక్ష్మి ఇప్పుట్లో పెంచే అవకాముందా అని శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఇప్పటికే చాలా పెంచినట్లు మంత్రి సమాధానమిచ్చారు. కులాంత‌ర వివాహాల‌కు సైతం క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు అమ‌లు చేసి, చెక్‌లు అందిస్తున్నామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్పష్టం చేశారు. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న వారి విష‌యానికి వ‌స్తే త‌ల్లికి లేదా బిడ్డకు చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments