Friday, November 22, 2024
Homeక్రైమ్మృత్యుఒడిలోకి ముగ్గురు కార్మికులు

మృత్యుఒడిలోకి ముగ్గురు కార్మికులు

విషాదం నింపిన బొగ్గు గని ప్రమాదం..
స్పాట్ వాయిస్, కరీంనగర్: గని ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రాణాలతో బయటికి వస్తారనుకున్న కుటుంబాల్లో కన్నీళ్లే మిగిలాయి. బొగ్గు పొరల కింద పడి ముగ్గురు కార్మికులు మృత్యుఒడికి చేరారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా విషాదం నిండుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్‌ లాంగ్ వాల్ ప్రాజెక్టులోని బొగ్గు గనిలో చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను బుధవారం వెలికి తీశారు. రెండ్రోజుల క్రితం అడ్రియాల్‌ భూగర్భ గనిలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలింది. ఇటీవల కూలిన పైకప్పును సరిచేస్తుండగా.. మరోసారి ప్రమాదం సంభవించింది. పైకప్పు కూలడంతో గనిలో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన రోజే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం బదిలీ వర్కర్‌ రవీందర్‌ను సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా… అసిస్టెంట్‌ మేనేజర్‌ చైతన్య తేజ విగతజీవిగా కనిపించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరు.. సేఫ్టీ మేనేజర్‌ జయరాజ్‌, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్‌ మృతి చెందారు. వారి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments