మహిళల భద్రతకు పోలీసుల కృషి
– ఎస్సై ఉదయ్ కిరణ్
-మహిళా దినోత్సవం సందర్భంగా సిబ్బందికి సన్మానం
స్పాట్ వాయిస్, గణపురం: మహిళల భద్రతకు పోలీసులు 24 గంటలు పని చేస్తూ కృషి చేస్తున్నారని ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ సిబ్బంది జయసుధ, శ్వేత, శ్రీవిద్య, స్వాతిలకు శాలువాతో సత్కరించారు. అనంతరం ఎస్సై ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలకు ఏమైనా సమస్యలుంటే పోలీసులకు సంబంధించిన డయల్ 100కు సమాచారం ఇచ్చి పోలీసుల నుంచి రక్షణ పొందాలని సూచించారు.
Recent Comments