తొలిసారి మండలిలో సిరికొండ అడుగు
స్పాట్ వాయిస్, గణపురం: శాసనసభ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తొలిసారి మండలిలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2022-23) ఉభయసభల్లో సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి తొలి స్పీకర్ గా ఉన్న సిరికొండ మధుసూదనాచారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి మండలిలో కాలు మోపారు. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మండలిలోకి వెళ్లారు.
Recent Comments