స్పాట్ వాయిస్, మహా ముత్తారం: గ్రామాల్లోని యువత పెడదారి పట్టొద్దని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అన్నారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో యువత, గ్రామస్తులకు ఆదివారం మత్తు పదార్థాలతో వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో గంజాయి రవాణా జరిగిన, సాగు చేసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. గుట్కా, గంజాయి, గుడుంబా, మద్యం వంటి వ్యసనాలను దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ రంజిత్ రావు, మహా ముత్తారం ఎస్సై రమేష్, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Recent Comments