మందుబాబులకు షాకిచ్చిన రేవంత్ సర్కార్
స్పాట్ వాయిస్, బ్యూరో: మందుబాబులకు సర్కారు మళ్లీ షాక్ ఇచ్చింది. ఇటీవలే బీర్ల ధరలను పెంచిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మద్యం ధరలను పెంచేసింది. విస్కీ, బ్రాండీ క్వార్టర్‌పై రూ.10, ఆఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచేసింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యూలర్ జారీ చేసింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, చీప్ లిక్కర్ ధరలు ఎలాంటి మార్పులుండవని పేర్కొంది.
Recent Comments