హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..
17 మంది మృతి..
స్పాట్ వాయిస్, బ్యూరో : హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య 17కు చేరింది. ఆదివారం తెల్లవారుజామున మీర్‌చౌక్‌లోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. గాయపడినవారిని మలక్‌పేట యశోద, హైదర్‌గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలినవారు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Recent Comments