కారు-బైకు ఢీకొని ఒకరు మృతి
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. యాదాద్రి జిల్లాకు చెందిన వ్యక్తి హన్మకొండకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో నిడిగొండ పెట్రోల్ పంపు సమీపంలో వరంగల్ నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Recent Comments