హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి రక్తమోడుతోంది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూ.. ప్రాణాలు బలికోరుతోంది. గత 15 రోజులు 5కు పైగా ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా రఘునాథపల్లి మండలంలో గోవర్థనగిరి గ్రామ బస్టాండ్ సమీపంలో మరో ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం బైక్ పై అన్నాచెల్లెలు మట్టెవాడ విజయ, లింగస్వామి వెళ్తుండగా.. వెనుక నుంచి కారు ఢీకొనగా.. అక్కడికక్కడే విజయ మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి లింగ స్వ్రామికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు గ్రామం స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్ గ్రామం. క్షతగాత్రుడిది కొమ్మల్ల గ్రామం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. జనగామ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్ యాదవ్ ప్రమాద తీరును పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments