బీఆర్ఎస్ కార్మిక శాఖ టేకుమట్ల మండల అధ్యక్షుడు నేరెళ్ల రామకృష్ణ గౌడ్
టేకుమట్లలో ఘనంగా మేడే వేడుకలు
స్పాట్ వాయిస్, టేకుమట్ల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయాలని టేకుమట్ల బీఆర్ ఎస్ కార్మిక శాఖ మండల అధ్యక్షుడు నేరెళ్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంతో పాటు బూర్నపల్లి, వెలిశాల, పంగిడిపల్లి, రాఘవరెడ్డిపేట, కుందనపల్లి వెల్లంపల్లి, ఎంపేడు, గ్రామాల్లో జరిగిన మేడే వేడుకలకు టేకుమట్ల బీఆర్ఎస్ కార్మిక శాఖ మండల అధ్యక్షుడు నేరేళ్ళ రామకృష్ణగౌడ్ హజరై, బూర్నపల్లిలోని హమాలి కార్మికుల ఎర్ర కండువాలతో ఘనంగా సన్మించారు. మండల కేంద్రంలోని హమలీలను, తాపీ మేస్త్రీలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక లోకం లేనితో అభివృద్ధి లేదన్నారు. ప్రతి ఒక్క కార్మికునికి హెల్త్ కార్డులను అందజేసి, కార్పొరేట్ వైద్యం అందించాలని, జీవిత బీమా సౌకర్యం కూడా ప్రభుత్వమే కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారెపల్లి మల్లేష్, నిమ్మల స్వామి, రామచందర్, దేవు సూరి రంజిత్, సదయ్య. శ్రీను, ప్రకాష్, నరేష్, కార్మిక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కృషి చేయాలి..
RELATED ARTICLES
Recent Comments