Saturday, May 3, 2025
Homeజిల్లా వార్తలుశ్రమజీవుల పోరాటాలకు దిక్సూచి మేడే

శ్రమజీవుల పోరాటాలకు దిక్సూచి మేడే

ఎంసీపీఐ (యూ ) ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవం
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: మే డే స్ఫూర్తితో దోపిడీ పాలకవర్గవినాశకర విధానాలపై ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ పిలుపు నిచ్చారు. శ్రమజీవుల పోరాటాలకు దిక్సూచిగా మేడే చిరస్థాయిగా నిలుస్తుందని శ్రమజీవులను దోచుకునే దోపిడీ పాలకవర్గ , వినాశకర విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలని పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక పర్వదినం అయిన మేడే ఉత్సవాల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో కారల్ మార్క్స్ కాలనీ, జ్యోతిబసు నగర్ కాలనీలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ జెండా ఎగరవేసి మాట్లాడారు. నర్సంపేట పార్టీ కార్యాలయం ఆవరణలో డివిజన్ కార్యదర్శి కామ్రే ఎండీ రాజాసాహెబ్, మాదన్నపేట, నాగూర్లపల్లి గ్రామాల్లో డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, అంగడి సెంటర్ లోని ఓంకార్ విగ్రహం వద్ద రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపూరావు , నర్సంపేట మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐసీటీయూ జెండాను జిల్లా అధ్యక్షులు ఎండీ మా షూక్ అరుణ పతాకాలను ఎగరవేశారు. నర్సంపేట మండలంలో రాజపల్లె, మహేశ్వరం, గార్లగడ్డ తండా, రాజుపేట గ్రామాల్లో మేడే ను జరుపుకున్నారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం, అనుమాల రమేష్, సిరిబొమ్మల భాస్కర్, దొమ్మాటి మల్లయ్య, కందికొండ సాంబయ్య, కర్నె సాంబయ్య, కేశెట్టి శ్రీనివాస్, వక్కల రాజమౌళి, ఆకుల రాజేందర్, గుర్రం రవి, సిరిబొమ్మల భాస్కర్, పాటిబండ్ల హరిబాబు, ఉప్పుల పద్మ, ఉప్పుల వీరస్వామి, కుమారస్వామి, జవాజి చంద్రమౌళి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments