ఆ ఆర్టీవో లను తన్నుడే ఉండే
పోలీసులు ఒక్కరూ పని చేయలె..
సభ ఫెయిల్ చేయడానికే చూసిండ్రు..
బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్..
స్పాట్ వాయిస్, హన్మకొండ: బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభను ఫెయిల్ చేసేందుకు రేవంత్ సర్కార్ శతవిధాలా ప్రయత్నం చేసిందని.. దీనికి ఆర్టీవో లు.., పోలీసుల పనితీరే నిదర్శనం అని బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సభకు వచ్చే వాహనాలను ఆర్టీవో అధికారులు అపారని.. కావాలని ట్రాఫిక్ జామ్ అయ్యేలా కుట్రలు చేసారని ఆరోపించారు. తాను ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే తన్నుడే అయి ఉండేదన్నారు. ఇక పోలీసులు కనీసం సహకరించలేదని.., ముందు నుంచి రూట్ మ్యాప్ వివరించిన పట్టించుకోలేదని ఆరోపించారు. 5గంటలకే లాఠీలు వదిలేసారని.., తాము ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నామని చెప్పారు.
Recent Comments