Saturday, April 19, 2025
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..

 ఇద్దరు అగ్రనేతలు మృతి

స్పాట్ వాయిస్, బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు​ అగ్రనేతలు ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం కొండగావ్​కు చెందిన రిజర్వ్ గార్డ్, పోలీసులు సంయుక్తంగా సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్​ రేంజ్ ఐజీ ​పీ సుందర్​రాజ్​ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతులు మావోయిస్టుల కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్లు చెప్పారు. హల్దార్, రమే తలలపై రూ.8 లక్షలు,రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments