మానుకోటలో మర్డర్..
గొడ్డలితో నరికి చంపిన దుండగులు
స్పాట్ వాయిస్, క్రైమ్: మహబూబాబాద్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. పార్థసారథి దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం భద్రాచలం. మంగళవారం ఇంటి నుంచి దంతాలపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా.. హత్య చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ తో విచారణ జరుపుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments