Saturday, April 5, 2025
Homeక్రైమ్కూలీలపైకి దూసుకెళ్లిన లారీ

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ

పొలంలో పని చేస్తున్న ఇద్దరు మృతి
తల్లులను కోల్పోయిన పిల్లలు..
స్పాట్ వాయిస్, టేకుమట్ల:రెక్కాడితేగాని డొక్కాడని కూలీలను మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో రెండు నిండు ప్రాణాలను బలయ్యాయి. ఈ హృదయ విదారకమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ టి గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. టేకుమట్ల మండలంలోని రామకృష్ణపూర్(టి)కి చెందిన మోకిడి పూలమ్మ( 51) మోకిడి సంధ్య (30) మరికొంత మంది కూలీలలో కలిసి పొలంలో కల్తులు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలోని పత్తి మిల్లు నుంచి పత్తి గింజల లోడ్ తో టేకుమట్ల వైపు వస్తున్న లారీ రామకృష్ణపూర్(టి) గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద ఉన్న వరిపొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈక్రమంలో వరిపొలంలోకి దిగిన పూలమ్మ, సంధ్యపై లోడ్ లారీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ జేసీబీల సాయంతో లారీని బయటకు తీసి, స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీసి చిట్యాల సీహెచ్సీకి తరలించారు. తమ తోటి కూలీ పనికి వచ్చిన తోటి కూలీలు తమ కళ్లముందే మృతి చెందడాన్ని తోటి కూలీలు జీర్ణించుకోలేక గుండెలు పగిలేల రోదించడం పలువురని కంటతడి పెట్టించింది. సంధ్యకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా, పూలమ్మకు ఓ కూతురు, మానసిక వికలాంగురాలు ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments