వ్యవసాయ కూలీలకు మరో ప్రమాదo
ఊడిన ట్రాలీ స్టీరింగ్ రాడ్డు
అదుపు తప్పి ట్రాలీ బోల్తా..
16మందికి తీవ్రగాయాలు ముగ్గురి పరిస్థితి విషమం..
స్పాట్ వాయిస్, మల్హర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మల్లారంలో మిర్చి ఏరేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మంథని- కాటారం ప్రధాన రహదారిపై నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాలీ స్టీరింగ్ రాడ్డు ఉడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 16 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో బొందల కిష్టమ్మ, అప్పల శైలజ, అప్పల వనిత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. మిగిలినవారిని పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments