స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ. 20వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ 6 నెలల ముందే జనగామ నుంచి స్టేషన్ ఘన్ పూర్ కు బదిలీపై వచ్చారు. అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments