Wednesday, March 19, 2025
Homeటాప్ స్టోరీస్రాజీవ్ యువ వికాసం కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

రాజీవ్ యువ వికాసం కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఎంత మొత్తానికి ఎంత సబ్సిడీ వస్తుందో తెలుసా..?
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. రూ.6 వేల కోట్లతో ప్రారంభించిన ఆ స్కీ్ం కింద రాష్ట్రంలోని అర్హులైన యువకులకు రూ.4 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సోమవారం (మార్చి) 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. లోన్ మొత్తాన్ని బట్టి 60 నుంచి 80 శాతం వరకు ప్రభుత్వమే సబ్సిడీ వస్తుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..
*https://tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
వెబ్ సైట్ ఓపెన్ చేయగానే రెండు బటన్స్ కనిపిస్తాయి. అందులో ‘రాజీవ్ యువ వికాసం పథకం రిజిస్ట్రేషన్’ మీద క్లిక్ చేయాలి.
* అనంతరం “Click here to Application Form for Rajiv Yuva Vikasam Scheme” మీద క్లిక్ చేయాలి.
* తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు ప్రత్యేకంగా 7 బటన్స్ కనిపిస్తాయి. ఏ వర్గానికి చెందినవారు ఆ బటన్ క్లిక్ చేస్తే దరఖాస్తుదారునికి సంబధించిన రిజిస్ట్రేషన్ ఫాం ఓపెన్ అవుతుంది
* అందులో.. దరఖాస్తుదారుని పేరు, ఆధార్ కార్డు నెంబర్, ఆహార భద్రత కార్డు నెంబర్ వివరాలు నింపాల్సి ఉంటుంది.
* సెక్టార్ అనే బాక్స్‌లో లోన్ ఏ సెక్టార్ కోసం తీసుకుంటున్నారన్నది సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి పక్కనే స్కీము అనే బాక్స్‌లో మీరు ఆ లోన్ దేని కోసం వాడతారన్నది ఎంచుకోవాలి.
* వెంటనే మీకు ఎంత మొత్తం లోన్ వచ్చే అవకాశం ఉందన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి.
ఆ తర్వాత (గో) అనే బటన్ క్లిక్ చేయగానే.. మీ దరఖాస్తుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తవగానే మీ అప్లికేషన్ రివ్యూలోకి వెళ్తుంది.
* దరఖాస్తుకు సంబంధించిన సమాచారం కోసం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసులో తెలుసుకోవచ్చు. లేదా హెల్ప్‌లైన్ నెంబర్ 040-12345678కి ఫోన్ చేయవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్లు
* ఆధార్ కార్డు
* కులం, ఆదాయం సర్టిఫికేట్స్
* బ్యాంకు అకౌంట్  
* రేషన్ కార్డు
* ఎంప్లాయీమెంట్ ఎక్స్‌ఛేంజ్ రిజిస్ట్రేషన్
ఎంత సబ్సిడీ ఎలా అంటే..
రాజీవ్ యువ వికాసం పథకం కింద లోన్ తీసుకునే వారికి సబ్సిడీ వర్తిస్తుంది. లబ్ధిదారుడు తీసుకున్న లోన్ మొత్తాన్ని బట్టి సబ్సిడీ ఆధారపడి ఉంటుంది. రూ. లక్ష లోపే తీసుకుంటే.. 80 శాతం సబ్సిడీ వచ్చే ఛాన్స్ ఉంది. 80 శాతం పోగా మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు కట్టాల్సి ఉంటుంది. లక్ష నుంచి 2 లక్షల వరకు లోన్ తీసుకుంటే.. 70 శాతం, 4 లక్షల వరకు లోన్ తీసుకుంటే మాత్రం 60 శాతం సబ్సిడీ వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments