స్పాట్ వాయిస్, గణపురం:కోటగుళ్లు( గణపేశ్వరాల సముదాయం) లోని గణపేశ్వరస్వామి వారికి మోదుగ పూలతో పుష్పార్చాన నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మోదుగ పూలతో కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 13 సంవత్సరాల నుంచి స్వామి వారికి మోదుగపూలతో పుష్పార్చన చేయడం ఆనవాయితీగా వస్తోంది. మోదుగ పూలు శివపూజకు అత్యంత ప్రాశస్తమైన పూలు .ఈ పుష్పాలను స్వామి వారికి సమర్పించడంతో శివుడు ఆనందంగా స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకుడు జూపల్లి నాగరాజు చెప్పారు. శుక్రవారం ఆలయ పరిస ప్రాంతంలో ఉన్న మోదుగ చెట్ల నుంచి సుమారుగా 100 కిలోల పూలను సేకరించి పూజలో ఉపయోగించినట్లు ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు చెప్పారు.
Recent Comments