బొలెరో- ద్విచక్ర వాహనం ఢీ
ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
స్పాట్ వాయిస్ సంగెం : బొలెరో- ద్విచక్ర వాహనం ఢీ కొని ఒకరు మృతి చెందిన ఘటన సంగెం మండలం తిమ్మాపురం సబ్ స్టేషన్ దగ్గరలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఒంగోలు జిల్లాకు చెందిన మేస్త్రీలు మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. హోలీ సందర్భంగా తిమ్మాపురం గ్రామంలో మామూల్లు అడుక్కొని తిరిగి బైకుపై మండల కేంద్రానికి వస్తుండగా బొలెరో వాహనం బైకును ఢీకొంది. దీoతో బైకుపై వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ఎంజీఎంకు తరలించగా మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments