రామగుండానికి అంబర్ కిషోర్ ఝా బదిలీ
రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ ల ట్రాన్స్ ఫర్
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సూర్యపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ ను వరంగల్ కమిషనరేట్కు బదిలీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసును సీఐడీకి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదేవిధంగా పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతనను తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పి.కరుణాకర్‌ను బదిలీ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కంరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగాఅఖిల్ మహాజన్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, సిరిసిల్లా ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యపేట్ ఎస్పీగా నరసింహా, సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, సీఐడీ ఎస్పీగా రవీందర్ బదిలీ అయ్యారు.
Recent Comments