పోలీస్ స్టేషన్ లో మందు పార్టీ ఎఫెక్ట్..
హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: జిల్లాలోని పెద్ద వంగర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్ ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్ పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు తాగారాని సిబ్బందిపై ఆరోపణలతో పాటు ఫొటో సోషల్ మీడియా లో వైరల్ అయినది. కాగా ఈ ఘటనపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ రిపోర్ట్ పంపగా ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.
Recent Comments