వరంగల్ లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్
టాస్క్‌ఫోర్స్ కొరడా..
రూ. 77,935 వేల విలువైన కూల్ డ్రింక్స్ స్వాధీనం
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ కరీమబాదులోని లోని సాయిబాబా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ లభ్యం అయ్యాయి. దాదాపు 21 రకాలు..రూ. 77,935 వేల విలువైన కూల్ డ్రింక్స్ ను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఏఏ స్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తన సిబ్బంది తో సాయిబాబా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ షాపు లో వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సంయుక్తంగా దాడి చేసారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
Recent Comments