Sunday, February 23, 2025
Homeలేటెస్ట్ న్యూస్గ్రామైఖ్య సంఘంలో గోల్ మాల్

గ్రామైఖ్య సంఘంలో గోల్ మాల్

రూ.17లక్షలు మాయం..
సొంతానికి వాడుకున్న వీఓఏ
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: మహిళ సంఘంలో గోల్ మాల్ జరిగింది. బ్యాంకులో డబ్బులు కట్టమని ఇస్తే.. వీవోఏ సొంతానికి వాడుకున్న ఘటన వెలుగు చూసింది. వేలు వందలు కాదు.. ఏకంగా రూ.17లక్షలు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో సిరి గ్రామైఖ్య సంఘం సభ్యులు శ్రీనిధి సంస్థ నుంచి రుణాలు పొందాయి. అయితే రుణాలకు నెలవారి చెల్లింపులను సిరి గ్రామైఖ్య సంఘంలో వీఓఏ గా పని చేస్తున్న పద్మకు చెల్లిస్తున్నారు. సభ్యులు చెల్లించిన డబ్బులను బ్యాంకులో కట్టకుండా సొంత అవసరాలకు వాడుకుంటుందని మహిళ సంఘం సభ్యులు ఆరోపించారు. సుమారు రూ.17 లక్షల వరకు డబ్బులను వాడుకుందని సభ్యులు తెలిపారు. గతంలో డబ్బుల విషయమై ప్రశ్నించగా.. సొంతానికి వాడుకున్నానని, తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లు బాధిత మహిళలు తెలిపారు. నేటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో బాధితులంతా సోమవారం కలెక్టరేట్ కు వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేశారు. వీఓఏ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments