Saturday, April 5, 2025
Homeతెలంగాణఉప ఎన్నికలు ఖాయం..

ఉప ఎన్నికలు ఖాయం..

పార్టీ మారినోళ్లు ఓడిపోతారు..
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితర నేతలు మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని, ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారని అన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments