ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం విచారణ..
రీజనబుల్ టైమ్ అంటే ఏంటి..?
ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన కోర్ట్
స్పాట్ వాయిస్, బ్యూరో :ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం జరిగిన విచారణ వాయిదా పడింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లతో కలిపి సోమవారం కేసు విచారణ జరిగింది. జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? అని మరోసారి సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. పది నెలలు అనేది రీజనబుల్ టైం కాదు అని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
Recent Comments