Monday, April 7, 2025
Homeజిల్లా వార్తలుసెరెన్ ఏరోసిటి బ్రోచర్ ఆవిష్కరణ

సెరెన్ ఏరోసిటి బ్రోచర్ ఆవిష్కరణ

సెరెన్ ఏరోసిటి బ్రోచర్ ఆవిష్కరణ*

*వరంగల్ లో సినీగేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, హిరోయిన్ ప్రియా హెగ్డేలచే

* ఖమ్మం బైపాస్ హై వే ప్రధాన రహదారిలో ప్రారంభమైన నూతన వెంచర్

*అధునాతన సాంకేతిక పద్ధతిలో అభివృద్ధితో రూపుదిద్దుకొంటున్న నూతన వెంచర్

*గ్రేటర్ కమ్యూనిటీ తరహాలో ప్రతి ప్లాటుకు రక్షణ వెంచర్ కల్పిస్తున్న మోక్షం

 

స్పాట్ వాయిస్ కాజీపేట:గ్రేటర్ వరంగల్ కాజీపేట మండలం కడిపికొండాలో అభివృద్ధి పరిచేలా నూతనంగా ఆరంభమైన సెరెన్ ఏరోసిటి ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ప్రముఖ సినీ గేయ రచయిత ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, హీరోయిన్ ప్రియా హెగ్డెల చేతుల మీదుగా వెంచర్ ఆరంభం జరిగినట్లు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే బాబు ఆగస్టస్ తెలిపారు. గ్రేటర్ మున్సిపల్ కార్యాలయాల అనుమతులతో ఏర్పడిన సెరెన్ ఏరోసిటి వెంచర్ ప్లాట్ల విశిష్టతను చైర్మన్ వివరిo చారు. వెంచర్ లో ప్రతి ప్లాటును నిర్దిష్ట పరిధిలో ఉంచడం విశేషం అన్నారు. భూమి కొనుగోలు చేసుకోవడం యాజమాన్య హక్కులు పొందడం కుటుంబ సభ్యుల ఆధార్ పాన్ కార్డ్ ప్రాధాన్యతకు సరి సమానంగా హక్కులు కల్పించబడేలా వెంచర్ ప్రాధాన్యత కల్పించబడుతుందని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మూడు కిలోమీటర్లు, మడికొండ ఐటీ హబ్ కు 6, మామునూర్ ఎయిర్ పోర్ట్ కు 12, కాజీపేట రైల్వే జంక్షన్ కి 5, ఎన్ఐటి వరంగల్ కి 6 కిలోమీటర్ దూరంలో వెంచర్ ఉంటుందన్నారు. మొదటి రోజే 23 ఫ్లాట్స్ కొనుగోలు కోసం అగ్రిమెంట్ రూపంలో నమోదు కావడం వెంచర్ ఆవశ్యకతను తెలియజెస్తోంది అన్నారు. అనంతరం తెలంగాణ మార్కెటింగ్ హెడ్ అశోక్ బెల్లంకొండ, వరంగల్ ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ హెడ్ విద్యాసాగర్ కాందారిలు మాట్లాడుతూ.. కస్టమర్ దేవుళ్ళకు ఎప్పుడు అనుకూలంగా వుంటూ అందరి మన్ననలను పొందుతూ అభివృద్ది కోసం పాటుపడతామని, భూమి కొనాలని వున్న ప్రతి కస్టమర్ కావలసిన సపోర్టు వుంటుందని, వెంచర్ లో కొన్నవారికి బ్యాంక్ లోన్ అందుబాటులో వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్లు ఎస్ వీరారెడ్డి, పల్లె రవీందర్, అసోసియేట్స్, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు. .

RELATED ARTICLES

Most Popular

Recent Comments