Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలుకేయూలో కొట్టుకున్న స్టూడెంట్స్

కేయూలో కొట్టుకున్న స్టూడెంట్స్

సీనియర్స్.. జూనియర్స్ మధ్య ఫైట్..
స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటీలోని మెస్ లో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు కోపంగా చూస్తున్నారని నెపంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై మాకుమ్మడిగా దాడి చేశారు. మేమేం తక్కువ అంటూ జూనియర్ల సైతం సీనియర్లపై విరుచుకుపోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పరస్పరం దాడి చేసుకున్న విద్యార్థులపై చర్యల కోసం కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments