Monday, January 27, 2025
Homeలేటెస్ట్ న్యూస్నా పేరు నాకు తెలియకుండా వచ్చింది..

నా పేరు నాకు తెలియకుండా వచ్చింది..

రేషన్ కార్డుకు దరఖాస్తు చేయలే..
నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలి
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : రేషన్ కార్డు దరఖాస్తుదారుల జాబితాలో నా పేరు ఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి, సివిల్ సప్లై మంత్రి జవాబు చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్బంగా శనివారం పెద్ది స్థానికంగా మాట్లాడారు. తాను రేషన్ కార్డు దరఖాస్తు చేసినట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఊహాగానాలు నమ్మొద్దని, నాకు చట్టాలు, పరిమితులు, పరిధులు తెలుసని, నేనెక్కడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదని, నా పేరు నాకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా, మండలం, గ్రామ అధికారులకు ఎలా చేరిందో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, సివిల్ సప్లై డైరెక్టర్ కు, సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐజీ హైదరాబాద్, జిల్లా కలెక్టర్ వరంగల్ కు మెయిల్ ద్వారా రాతపూర్వక ఫిర్యాదు పంపినట్లు ఈ సందర్భంగా పెద్ది చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments