ఆటో డ్రైవర్ హత్య
హన్మకొండలో దారుణం..
ప్రాణం తీసిన వివాహేత సంబంధం
అదాలత్ వద్ద పట్ట పగలే మర్డర్
స్పాట్ వాయిస్ , క్రైమ్: హనుమకొండ జిల్లా కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా మడికొండకి చెందిన మాచర్ల రాజ్ కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఇద్దరు ఆటో డ్రైవర్లు. వీరిద్దరికి ఒకే మహిళతో వివాహేతర సంబంధం వుంది. ఈ విషయంలో రాజ్ కుమార్, వెంకటేశ్వర్లకు మధ్య మాట మాట పెరిగి హనుమకొండ అదాలత్ సెంటర్ డీ మార్టు సమీపంలో రాజ్ కుమార్ ను ఏనుగు వెంకటేశ్వర్లు కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా మృత దేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments