పోచారం స్టేషన్ లో పలు సెక్షన్ల కింద నమోదు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. 126(2), 115(2), 352, 351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్‌లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తన అనుచరులు 30 మందితో కలిసి వచ్చి ఎంపీ ఈటల తనపై దాడి చేశారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, మంగళవారం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో మంగళవారం రాజేందర్ ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో రియల్ ఎస్టేట్ దళారిపై ఈటల చేయిచేసుకున్న విషయం తెలిసిందే.
Recent Comments