స్పాట్ వాయిస్, బ్యూరో: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సిబ్బంది.. ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు.. పద్మారావు గౌడ్‌కు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు.
Recent Comments