Monday, May 5, 2025
Homeతెలంగాణఈటల ఫైర్..

ఈటల ఫైర్..

ఈటల ఫైర్..

రియల్ బ్రోకర్ చెoప చల్లు 

పేదల భూములు అక్రమిస్తారా అంటూ ఆగ్రహం 

స్పాట్ వాయిస్ , బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై చేయి చేసుకున్నారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్‌ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని ఈటల స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళ్తే..

ఎంపీ

మల్కాజ్‌గిరి జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలనగర్‌లో పేదలను ఇబ్బందులు పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి మంగళవారం ఈటల వెళ్లారు. ఈ క్రమంలో ఎంపీని అడ్డుకుంటామని, టెంట్లు కూడా తగలబెడతామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు. ఈ నేపథ్యంలో ఈటల అక్కడ భూములను పరిశీలిస్తున్న క్రమంలో బ్రోకర్లు వచ్చారు. వారిని చూసి ఆగ్రహానికి గురైన ఎంపీ ఈటల రాజేందర్ ఓ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై దాడి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments