ఆరేళ్ల బాలికపై లైంగికదాడి..
-పోక్సో కేసు నమోదు..?
స్పాట్ వాయిస్, క్రైం: ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి తెగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం ఈ దారుణం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో బాలిక స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉంది. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు లైంగికదాడి చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు రఘునాథపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Recent Comments