- నర్సంపేట మున్సిపాలిటీ లో 9 గ్రామాల విలీనం
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట మున్సిపాలిటీని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు నర్సంపేట మునిసిపాలిటీ పరిధిలోకి కొత్తగా తొమ్మిది గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మున్సిపాలిటీ పరిధిలోకి మాదన్నపేట, నాగుర్లపల్లి, మహేశ్వరం, ముగ్దుమ్ పురం, రాజపల్లె, ముత్తోజిపేట, రాజుపేట, రాములు నాయక్ తండా, పర్శ్ నాయక్ తండా గ్రామాలు విలీనం అవుతున్నాయి. గ్రామాల విలీనం నేపథ్యంలో నర్సంపేట మున్సిపాలిటీ మరింత బలోపేతం కానుంది. నర్సంపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం 44 వేల మంది జనాభా ఉన్నారు. విలీన గ్రామాల జనాభా దాదాపు 15 వేల పైగా ఉంది. మొత్తంగా మున్సిపాలిటీ పరిధి 60 వేల జనాభా దాటనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రేడ్ 3 లో ఉన్న మున్సిపాలిటీ గ్రేడ్ 2 కి అప్‌గ్రేడయ్యే అవకాశం ఉంది. గ్రేడ్2 కి అప్‌గ్రేడ‌్ జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. విలీన గ్రామాల్లో ఇప్పటి వరకు సెర్ప్ కింద పని చేసిన మహిళా సంఘాలు మెప్మా కిందకు రానున్నాయి. ఉపాధి హామీ పథకం మినహా అన్ని పథకాలు విలీన తొమ్మిది గ్రామాల్లో అమలు కానున్నాయి.
నర్సంపేట మున్సిపాలిటీ లో 9 గ్రామాల విలీనం
RELATED ARTICLES
Recent Comments