స్పాట్ వాయిస్, క్రైమ్: మాజీ మంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని పొన్నాల ఇంట్లో రూ.1.5 లక్షల నగదుతోపాటు భారీగా బంగారు అభరణాలను దుండగులు చోరీ చేశారు. దీంతో ఆయన సతీమణి అరుణా దేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్వ గ్రామంలో ఆందోళన
రఘునాథపల్లి: రఘునాథపల్లి మండలం కిలాసాపురం గ్రామానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య సొంత ఊరులో ప్రజలు మన సార్ ఇంట్లో దొంగలు పడ్డారని చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా అయ్యో ఉండాలా పొన్నాల ఇంట్లో దొంగలు పడ్డారని అనుకుంటున్నారు.
Recent Comments