Wednesday, January 8, 2025
Homeక్రైమ్12.30లోపు ముగించాలి..

12.30లోపు ముగించాలి..

12.30లోపు ముగించాలి..
ముమ్మరంగా పెట్రోలింగ్..
వేడుకలకు పర్మిషన్ తీసుకోవాలి
అశ్లీలతకు నో ఛాన్స్..
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలే..
నిబంధనలు విస్మరిస్తే 100కు డయల్ చేయండి
ఇంట్లోనే సంతోషంగా సంబురం చేసుకుందాం..
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా
స్పాట్ వాయిస్, హన్మకొండ: సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు ప్రశాంత వాతవరణంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ సోమవారం ప్రకటనలో కోరారు. డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌, షీ టీమ్స్‌తో పాటు పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్ధరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసే సంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుంచి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్నారు. అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లవారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకే..
ఇయర్ ఎండ్ వేడుకల వేళ యువకులు మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి.., డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధిస్తారన్నారు. అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసేలా వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ట్రాఫిక్‌ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ట్రై సిటీతో పాటు, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయన్నారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసేలా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందన్నారు. అంక్షలను ఎవరైనా అతిక్రమించినట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments