Wednesday, January 8, 2025
Homeటాప్ స్టోరీస్కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

స్పాట్ వాయిస్, బ్యూరో: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎమ్ డీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు అందచేసింది. వారిద్దరినీ జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద వారిని ఈడీ విచారణ చేయనుంది.

ఫెమా ఉల్లంఘన..

ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో వీరంతా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎఫ్ఈవోకు నగదు బదిలీతోపాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments