Thursday, January 9, 2025
Homeక్రైమ్కాటారం లో మళ్ళీ రక్తం పారింది..

కాటారం లో మళ్ళీ రక్తం పారింది..

 

భూ తగాదాలో మరో ప్రాణం బలి

కాటారం మండలం లో వరుస ఘటనల కలకలం

కాటారం లో వ్యక్తి  హత్య

స్పాట్ వాయిస్, కాటారం : జయశంకర్ జిల్లాలో మరో హత్య జరిగింది. కాటారం మండలకేంద్రంలో శుక్రవారం రక్తo పారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండల కేంద్ర పరిధిలో ఇప్పలగూడెం కు చెందిన డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబం తో గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగగా మాట మాట పెరిగి కర్రలతో దాడిచేసుకున్నట్లుగా సమాచారం. దీంతో బుచ్చయ్య తలపై పెద్ద దుంగతో కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. కాగా కాటారం మండలంలో ఇటీవల భూ వివాదాలతో వరుసహత్య లు చోటుచేసుకోవడం మండల వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments