Thursday, January 9, 2025
Homeతెలంగాణనిరుపేద కూలీలకు రూ.6 వేలు.. 

నిరుపేద కూలీలకు రూ.6 వేలు.. 

నిరుపేద కూలీలకు రూ.6 వేలు.. 

స్పాట్ వాయిస్, బ్యూరో: భూమిలేని నిరుపేద కూలీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబరు 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు 6వేల రూపాయలు ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతన్నల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే బీఆర్ఎస్ నాయకులకు తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments