కాటారం మండలంలో దారుణ హత్య
స్పాట్ వాయిస్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దారుణ హత్య చోటు చేసుకుంది. మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో మారపాక సారయ్య(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మారుపాక సారయ్య(50) తన కొడుకుతో కలిసి బైక్ పై వెళ్తుండగా దారికాసి కళ్లలో కారం పొడి చల్లి గొడ్డలితో నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. తోటి కుటుంబీకులే హత్య చేసినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సీఐ నాగార్జున రావు పరిశీలించారు.
కళ్లల్లో కారం చల్లి..
RELATED ARTICLES
Recent Comments