స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన కన్నెబోయిన స్రవంతి (23) నర్సింగ్ విద్యార్థిని బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వారి బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల వెతకగా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తండ్రి కన్నెబోయిన రాజేందర్ తన కూతురు కనిపించడం లేదంటూ గురువారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఎత్తు 5 ఫీట్లు, తెలుపు రంగులో ఉండి గుండ్రటి ముఖం కలిగి ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన దామెర ఎస్సై సెల్ నంబర్, 8712685228 లేదా పీఎస్ నెంబర్ 8712685020 కాల్ చేయాలని సూచించారు
Recent Comments