స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) ఆర్టీజన్, సంఘ సేవకుడు బొమ్మకంటి రాజేందర్ జాతీయ సేవారత్న అవార్డు 2024కు ఎంపికైనట్లుగా బీఎస్ఏ సెలక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎం గౌతమ్, రాష్ట్ర కో ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, సెలక్షన్ కమిటీ మెంబర్ చిలువేరు మల్లయ్య తెలిపారు. ఈ మేరకు అవార్డ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్‌లోని జాతీయ సాహిత్య కార్యాలయంలో అందజేసినట్లు చెప్పారు. ఈ నెల 15న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే బహుజన సాహిత్య అకాడమీ 5వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆల్ ఇండియాలోని 27 రాష్టాల నుంచి సుమారు 1000 మంది డెలిగేట్స్ హాజరుకానున్నట్లు తెలిపారు.
జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపికైన బొమ్మకంటి
RELATED ARTICLES
Recent Comments